రెండో టెస్టుకు ట్రెంట్ బౌల్ట్ దూరం | Trent Boult ruled out of second Test against Pakistan | Sakshi
Sakshi News home page

రెండో టెస్టుకు ట్రెంట్ బౌల్ట్ దూరం

Nov 24 2016 1:10 PM | Updated on Sep 4 2017 9:01 PM

రెండో టెస్టుకు ట్రెంట్ బౌల్ట్ దూరం

రెండో టెస్టుకు ట్రెంట్ బౌల్ట్ దూరం

రేపట్నుంచి ఇక్కడ సెడాన్ పార్క్లో పాకిస్తాన్తో జరుగనున్న చివరిదైన రెండో టెస్టు నుంచి న్యూజిలాండ్ ప్రధాన పేసర్ ట్రెంట్ బౌల్ట్ వైదొలిగాడు.

హామిల్టన్: రేపట్నుంచి ఇక్కడ సెడాన్ పార్క్లో పాకిస్తాన్తో జరుగనున్న చివరిదైన రెండో టెస్టు నుంచి న్యూజిలాండ్ ప్రధాన పేసర్ ట్రెంట్ బౌల్ట్ వైదొలిగాడు. అతని కుడి మోచేతికి గాయం కావడంతో రెండో టెస్టుకు దూరం కానున్నట్లు న్యూజిలాండ్ కోచ్ హెస్సన్ తెలిపాడు. బౌల్ట్ స్థానంలో ఇప్పటికే ఆల్ రౌండర్ బ్రాస్వెల్ను జట్టులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాడు.


'గత కొన్ని రోజుల నుంచి బౌల్ట్ గాయంతో బాధపడుతున్నాడు. తొలి టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ బౌల్ట్ గాయపడటంతో ఆ నొప్పి ఇంకా ఎక్కువైంది. దాంతో అతనికి రెండో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చాం. తొలుత అతను రెండో టెస్టులో పాల్గొంటాడని భావించినా, బుధవారం నిర్వహించిన ఫిట్ నెస్లో విఫలమయ్యాడు. దాంతో అతనికి విశ్రాంతి తప్పలేదు' అని హెస్సన్ తెలిపాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement