హైదరాబాద్ జిల్లా త్రోబాల్ సంఘం (హెచ్‌డీటీబీఏ) అధ్యక్షుడిగా ఇన్‌కం ట్యాక్ ఆఫీసర్ డి.శ్రీధర్, ప్రధాన కార్యద ర్శిగా ఎం.బి.నర్సింలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా త్రోబాల్ సంఘం (హెచ్‌డీటీబీఏ) అధ్యక్షుడిగా ఇన్‌కం ట్యాక్ ఆఫీసర్ డి.శ్రీధర్, ప్రధాన కార్యద ర్శిగా ఎం.బి.నర్సింలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ముషీరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ క్రీడామైదానంలో శనివారం సాయత్రం ఈ ఎన్నికలు రిటర్నింగ్ అధికారి బి.లక్ష్మయ్య పర్యవేక్షణలో జరిగాయి. ఎం.బి.నర్సింలు ప్రస్తుతం జాతీయ వాలీబాల్ రిఫరీగా వ్యవహరిస్తున్నారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఆలేరు బాలరాజ్, జి.శ్రీనివాస్‌రెడ్డి, జి.రాజేందర్‌రెడ్డి, బి.రఘనాథ్ రెడ్డి. ఎన్.లక్ష్మీరెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా టి.మాధవి, బి.లక్ష్మయ్య, వై.రాజు, టి.చంద్రమౌళి, కోశాధికారిగా డాక్టర్ కె.ఉమారావు, కార్యవర్గ సభ్యులుగా సి.లక్ష్మీ, ఎం.హేమలత, బి.శేఖర్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులు తమ పదవుల్లో నాలుగేళ్లు కొనసాగుతారు.
ఈనెల 16 నుంచి అంతర్ జిల్లా మహిళల త్రోబాల్ టోర్నీ
అంతర్ జిల్లా మహిళల త్రోబాల్ టోర్నమెంట్ ఈనెల 16,17వ తేదీల్లో ముషీరాబాద్ ప్లేగ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్దతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఆసక్తి గల జట్లు ఈ నెల 13లోగా తమ ఎంట్రీలను పంపించాలి. ఇతర వివరాలకు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.బి.నర్సింలు(93910-14410)ను సంప్రదించవచ్చు.