కోహ్లి ఎంట్రీ.. సమావేశం వాయిదా!

Team India Selection Meeting For West Indies Tour Postponed - Sakshi

ముంబై : వెస్టిండీస్‌ పర్యటన కోసం టీమిండియా ఆటగాళ్ల ఎంపిక వాయిదా పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే సారథి విరాట్‌ కోహ్లి ఇంగ్లండ్‌ నుంచి భారత్‌కు తిరిగొచ్చేయడంతో పాటు విండీస్‌ పర్యటనకు విశ్రాంతి తీసుకోనని తెలపడంతో ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనకు కోహ్లి అందుబాటులో ఉండటంతో అతడి సమక్షంలో లేదా అతడితో చర్చించే కలిసే జట్టును ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ నెల 20న లేదా 21న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. 

ఈ పర్యటన కోసం సెల​క్టర్లు ప్రయోగాలు చేయాలని తొలుత భావించారు. సీనియర్‌ ఆటగాళ్లు కోహ్లి, ధోని, జస్ప్రిత్‌ బుమ్రాలకు విశ్రాంతినిచ్చి మనీష్‌ పాండే, శ్రేయాస్‌ అయ్యర్‌, ఖలీల్‌ అహ్మద్‌, నవదీప్‌ సైనీలను జట్టులోకి తీసుకోవాలని భావించింది. అయితే కోహ్లి విశ్రాంతి తీసుకోవడానికి అయిష్టత చూపడంతో సీన్‌ రివర్సయింది. కేవలం ధోనికే విశ్రాంతినిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని సెలక్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో సెలక్టర్ల సమావేశం ఆసక్తిగా మారింది. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top