ఎదురీదుతున్నశ్రీలంక | srilanka lose 4 wicket at 48 runs | Sakshi
Sakshi News home page

ఎదురీదుతున్నశ్రీలంక

Nov 13 2014 6:39 PM | Updated on Nov 9 2018 6:43 PM

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఈడెన్ గార్డెన్ లో గురువారం జరుగుతున్న నాల్గో వన్డేల శ్రీలంక ఎదురీదుతోంది.

కోల్ కతా: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా  ఈడెన్ గార్డెన్ లో గురువారం జరుగుతున్న నాల్గో వన్డేల శ్రీలంక ఎదురీదుతోంది. టీమిండియా విసిరిన 405 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ పెరీరా(0), చండీమాల్(9), మహేలా జయవర్దనే(2) వికెట్లను కోల్పోయింది. మరోప్రక్క దిల్షాన్ కాసేపు ఫర్వాలేదనిపించినా నాల్గో వికెట్టు రూపంలో వెనుదిరిగాడు. దిల్షాన్(34)పరుగులు చేసి అవుట్ కావడంతో శ్రీలంకకు కష్టాలు ఆరంభమయ్యాయి. ప్రస్తుతం 11.4 ఓవర్లలో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి 57 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, స్టువర్ట్ బిన్నీలు చెరో రెండు వికెట్లు తీశారు.

 

అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా టీమిండియా 405 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడి డబుల్ సెంచరీ( 264) చేయడంతో భారత్ భారీ స్కోరును నమోదు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement