ఉత్కంఠపోరులో శ్రీలంక గెలుపు 

Sri Lanka Won First ODI Against West Indies - Sakshi

కొలంబో: చివరి ఓవర్‌దాకా ఉత్కంఠగా సాగిన తొలి వన్డేలో శ్రీలంక వికెట్‌ తేడాతో వెస్టిండీస్‌పై విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కరీబియన్‌ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 289 పరుగులు చేసింది. షై హోప్‌ (115; 10 ఫోర్లు) శతకంతో రాణించాడు. ఇసురు ఉదానకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో శ్రీలంక 49.1 ఓవర్లలో 9 వికెట్లకు 290 పరుగులు చేసి గెలిచింది. టాపార్డర్‌లో అవిష్క ఫెర్నాండో (50; 5 ఫోర్లు, సిక్స్‌), దిముత్‌ కరుణరత్నే (52; 7 ఫోర్లు), కుశాల్‌ పెరీరా (42; 4 ఫోర్లు) రాణించారు. మిడిలార్డర్‌ తడబడ్డా... చివర్లో తిసారా పెరీరా (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్‌), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వనిందు హసరంగ డిసిల్వా (39 బంతుల్లో 42 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) దూకుడుగా ఆడి మిగతా పనిని పూర్తి చేశారు. రెండో వన్డే ఈ నెల 26న జరుగుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top