స్ప్రింట్‌లో ఆసియా రికార్డు | Sprint Asian record | Sakshi
Sakshi News home page

స్ప్రింట్‌లో ఆసియా రికార్డు

Sep 29 2014 1:06 AM | Updated on Sep 2 2017 2:04 PM

స్ప్రింట్‌లో ఆసియా రికార్డు

స్ప్రింట్‌లో ఆసియా రికార్డు

ఇంచియాన్: డోపింగ్‌లో పట్టుబడి గత జనవరిలో రెండేళ్ల నిషేధం పూర్తిచేసుకొని బరిలోకి దిగిన ఖతార్ అథ్లెట్ ఫెమీ ఒగునోడ్ ఆసియా క్రీడల్లో రెండు రికార్డులను సవరించాడు.

100 మీటర్లలో ఫెమీ ఒగునోడ్ ఘనత
 ఇంచియాన్: డోపింగ్‌లో పట్టుబడి గత జనవరిలో రెండేళ్ల నిషేధం పూర్తిచేసుకొని బరిలోకి దిగిన ఖతార్ అథ్లెట్ ఫెమీ ఒగునోడ్ ఆసియా క్రీడల్లో రెండు రికార్డులను సవరించాడు. ఆదివారం జరిగిన పురుషుల 100 మీటర్ల (స్ప్రింట్) రేసులో ఫెమీ 9.93 సెకన్లలో గమ్యానికి చేరుకొని కొత్త ఆసియా రికార్డుతోపాటు ఆసియా క్రీడల రికార్డును సృష్టించాడు. దాంతో 9.99 సెకన్లతో శామ్యూల్ ఫ్రాన్సిస్ (ఖతార్-2007లో) పేరిట ఉన్న ఈ రికార్డు తెరమరుగైంది. నైజీరియాలో జన్మించిన ఫెమీ 2009లో ఖతార్ పౌరసత్వాన్ని తీసుకొని ఆ దేశం తరఫున పాల్గొంటున్నాడు. మహిళల 100 మీటర్ల స్వర్ణాన్ని యోంగ్లీ వీ (చైనా-11.48 సెకన్లు) సాధించింది.



 

Advertisement
 
Advertisement
Advertisement