అతడే నా ఫెవరెట్‌ ప్లేయర్: గంగూలీ | Sourav Ganguly says that swiss master is his favourite player | Sakshi
Sakshi News home page

అతడే నా ఫెవరెట్‌ ప్లేయర్: గంగూలీ

Jan 28 2017 9:33 PM | Updated on Sep 5 2017 2:21 AM

అతడే నా ఫెవరెట్‌ ప్లేయర్: గంగూలీ

అతడే నా ఫెవరెట్‌ ప్లేయర్: గంగూలీ

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఫలితం ఏం రాబుతుందోనని ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కోల్‌కతా: ఆస్ట్రేలియన్  ఓపెన్  ఫైనల్లో ఫలితం ఏం రాబుతుందోనని ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మేజర్ టోర్నీ ప్రారంభానికి ముందు స్పెయిన్ బుల్ రాఫెల్‌ నాదల్, స్విట్జర్లాండ్ మాస్టర్ రోజర్‌ ఫెడరర్‌ ఫైనల్లోకి వస్తారని టెన్నిస్‌ పండితులు కూడా భావించలేదు. అయితే టెన్నిస్ ఆటగాళ్లు, అభిమానులకే కాదు పలువురు మాజీ క్రికెటర్లకు ఈ ఇద్దరిలో టైటిల్ ఎవరు సాధిస్తారా అని కాస్త టెన్షన్ పట్టుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం తన ఓటు స్విస్ స్టార్ ఫెడరర్‌కే అని ప్రకటించాడు. ఫెడరర్ మరో గ్రాండ్‌స్లామ్ గెలిస్తే చూడాలని ఉందని జాతీయ మీడియాతో మాట్లాడుతూ గంగూలీ తన మనసులో మాటను బయటపెట్టాడు.

టీమిండియా విషయానికొస్తే.. దాదాపు మూడేళ్ల తర్వాత వన్డేల్లో పునరాగమనం చేసిన యువరాజ్ సింగ్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అద్భుత ఫామ్ లో ఉన్నారని కితాబిచ్చాడు. నాగ్‌పూర్‌లో జరగనున్న రెండో ట్వంటీ20 కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు ఉండక పోవచ్చునని, తొలి టీ20 టీమ్‌తో కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడని అభిప్రాయపడ్డాడు. టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ ఇప్పటికే 1-0లో ఆధిక్యంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement