'దాదా.. శత్రువులే ఎక్కువమంది ఉంటారు' | sourav ganguly has future in india cricket, says javagal srinath | Sakshi
Sakshi News home page

'దాదా.. శత్రువులే ఎక్కువమంది ఉంటారు'

Sep 23 2015 6:58 PM | Updated on Sep 3 2017 9:51 AM

'దాదా.. శత్రువులే ఎక్కువమంది ఉంటారు'

'దాదా.. శత్రువులే ఎక్కువమంది ఉంటారు'

భారత క్రికెట్లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి మంచి భవిష్యత్ ఉందని మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ అన్నాడు.

హైదరాబాద్: భారత క్రికెట్లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి మంచి భవిష్యత్ ఉందని మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ అన్నాడు. అయితే క్రికెట్ పాలనాధికారిగా స్నేహితుల కంటే శత్రువులే ఎక్కువమంది ఎదురవుతారని శ్రీనాథ్ హెచ్చరించాడు.

క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా గంగూలీని నియమించే అవకాశముందని వార్తలు వచ్చిన నేపథ్యంలో శ్రీనాథ్ పైవిధంగా స్పందించాడు. బీసీసీఐ అధ్యక్షుడు, క్యాచ్ చీఫ్ జగ్మోహన్ దాల్మియా మరణంతో ఈ రెండు పదవులు ఖాళీ అయ్యాయి.  ప్రస్తుతం క్యాబ్ సంయుక్త కార్యదర్శిగా ఉన్న గంగూలీని చీఫ్గా నియమిస్తే బాగుంటుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement