జైలుపాలయిన క్రికెటర్ | Shahadat Hossain jailed | Sakshi
Sakshi News home page

జైలుపాలయిన క్రికెటర్

Oct 5 2015 1:40 PM | Updated on Sep 3 2017 10:29 AM

జైలుపాలయిన క్రికెటర్

జైలుపాలయిన క్రికెటర్

తమ ఇంట్లో పని చేసిన బాలికను వేధించి, తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హుస్సేన్ కోర్టులో లొంగిపోయాడు.

ఢాకా:  తమ ఇంట్లో పని చేసిన బాలికను వేధించి, తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హుస్సేన్ కోర్టులో లొంగిపోయాడు. సోమవారం షహదత్ ఢాకా కోర్టులో హాజరయ్యాడు. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని జైలుకు తరలించారు.

ఇదే కేసులో షహదత్ భార్య న్రిట్టో హుస్సేన్ ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. షహదాత్ భార్య పుట్టింట్లో పోలీసులు సోదాలు చేపట్టి అరెస్ట్ చేశారు. ఈ కేసులో షహదత్ దంపతులు కొంతకాలంగా తప్పించుకుని తిరిగారు. భార్య అరెస్ట్ అయిన మరుసటి రోజే షహదత్ కోర్టులో లొంగిపోయాడు. ఇటీవలే షహదత్ హుస్సేన్ దంపతులు తమ ఇంట్లో పని చేస్తున్న బాలికను తీవ్రంగా కొట్టినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. బంగ్లా తరఫున షహదత్ 38 టెస్టులు, 51 వన్డేలు ఆడాడు. 

Advertisement
 
Advertisement
Advertisement