సమీర్ అహ్మద్ గెలుపు | Sameer Ahmed victory | Sakshi
Sakshi News home page

సమీర్ అహ్మద్ గెలుపు

Sep 22 2013 12:03 AM | Updated on Sep 1 2017 10:55 PM

హైదరాబాద్ జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ సంఘం నిర్వహించిన సీనియర్ సెలక్షన్ ట్రయల్స్‌లో 96 కేజీ విభాగంలో సమీర్ అహ్మద్ (అలీ ఉస్తాద్ యాకుత్‌పురా) మొదటి స్థానంలో నిలిచాడు.

 జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ సంఘం నిర్వహించిన సీనియర్ సెలక్షన్ ట్రయల్స్‌లో 96 కేజీ విభాగంలో సమీర్ అహ్మద్ (అలీ ఉస్తాద్ యాకుత్‌పురా) మొదటి స్థానంలో నిలిచాడు. ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన ఈ పోటీల్లో సమీర్ అహ్మద్, అబ్దుల్ ఖాదిర్ (సతర్ పహిల్వాన్ బిన్‌ఖలీఫా) తలపడ్డారు.
 
   సమీర్ అహ్మద్ నెగ్గగా... అహ్మద్ ఖాదిర్ రెండో స్థానంతో సంతృప్తి చెందాడు. 96+ కేజీల విభాగంలో శ్రీనాథ్ యాదవ్ (అడవయ్య ఉస్తాద్ శ్రీను పహిల్వాన్) మొదటి స్థానం, సౌద్ బాన్ అహ్మద్ బమాసాక్ (బమాస్ అఖాడా) రెండో స్థానం కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో గెలిచిన ఆటగాళ్లు హైదరాబాద్ జిల్లా తరఫున అంతర్ జిల్లా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నారు. ఈ నెల 27, 28వ తేదీల్లో సంగారెడ్డిలో ఈ చాంపియన్‌షిప్ జరగనుంది.
 
 ఇతర ఫలితాలు
 84 కేజీలు: 1. అబ్దుల్ రహీం (బౌమ్ అఖాడా), 2. ముజ్జు (అలీ ఉస్తాద్ అఖాడా క ర్వాన్); 74 కేజీలు: 1. దినేష్ (శ్రీరామ్ వ్యాయామశాల జియాగూడ), 2. ధీరజ్ యాదవ్ ( ఉప్రాస్ వ్యాయామశాల బడే బయ్యా ఉస్తాద్); 66 కేజీలు: 1. సంతోష్ (డబ్ల్యూసీసీ), 2. హబీబ్ (బమాస్ అఖాడా); 60 కేజీలు: 1. వినయ్, 2.  ముజీబ్ (అల్ అల్వా తాలీం); 55 కేజీలు: 1. దేవి సింగ్ (లాలా తాలీం), 2. ధరమ్ సింగ్ (మెడికల్ డిపార్ట్‌మెంట్).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement