లీ చోంగ్ వీకి సాయి ప్రణీత్ షాక్ | Sai Praneeth Stuns Lee Chong Wei in All-England Championship First Round | Sakshi
Sakshi News home page

లీ చోంగ్ వీకి సాయి ప్రణీత్ షాక్

Mar 10 2016 4:34 PM | Updated on Sep 3 2017 7:26 PM

లీ చోంగ్ వీకి సాయి ప్రణీత్ షాక్

లీ చోంగ్ వీకి సాయి ప్రణీత్ షాక్

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాడు సాయి ప్రణీత్ సంచలన విజయాన్ని నమోదు చేశాడు.

బర్మింగ్‌హమ్:ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాడు సాయి ప్రణీత్ సంచలన విజయాన్ని నమోదు చేశాడు.  సాయి ప్రణీత్ 24-22, 22-20 తేడాతో ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) ను బోల్తా కొట్టించాడు.  ఆద్యంతం ఇరువురి మధ్య ఉత్కంఠభరితంగా సాగిన పోరులో సాయి ప్రణీత్ అంచనాలు మించి రాణించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

 

తొలి గేమ్లో లీంగ్ చో వీ 11-3, 15-7 ఆధిక్యంలో దూసుకువెళ్లినా, ప్రణీత్ నిలకడను ప్రదర్శించి ఆ గేమ్ను గెలిచాడు. ఆ తరువాత రెండో గేమ్లో కూడా  లీ చోంగ్ వీ 16-10, 17-12 తేడాతో ముందంజ వేశాడు. కాగా, 19వ పాయింట్ వద్ద లీ చోంగ్ వీని నిలువరించిన ప్రణీత్ ఇక్కడ మూడు పాయింట్లను సాధించి విజయ ఢంకా మోగించాడు. దీంతో మూడుసార్లు ఆల్ ఇంగ్లండ్ ట్రోఫీ గెలిచిన లీ చోంగ్ వీ పోరు తొలి రౌండ్లోనే ముగిసినట్లయ్యింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement