ఇది ఎలా ఉంది బాస్‌: సచిన్‌ | Sachin Tendulkar Posts Pictures Of His New Hairdo | Sakshi
Sakshi News home page

ఇది ఎలా ఉంది బాస్‌: సచిన్‌

Apr 20 2020 10:19 AM | Updated on Apr 20 2020 10:25 AM

Sachin Tendulkar Posts Pictures Of His New Hairdo - Sakshi

ముంబై: మాస్టర్‌  బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి దాదాపు ఏడేళ్లు అవుతుంది. 2013లో తన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సచిన్‌.. ఇప్పటికీ ఆ గేమ్‌ను ఆస్వాదిస్తాడు. తనకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టిన క్రికెట్‌తో సచిన్‌ ఏదో రకంగా మమేకం అవుతూనే ఉంటాడు సచిన్‌. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సచిన్‌.. అవకాశం దొరికితే తన చేసిన పనికి క్రికెట్‌ పరిభాషనే ఉపయోగించడం ఆ దిగ్గజ క్రికెటర్‌కు అలవాటు. ఆదివారం తనకు తానే హెయిర్‌స్టైల్ చేసుకుంటున్న కొన్ని ఫొటోలను సచిన్ షేర్‌ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో కొత్త లుక్‌లో కనిపించిన సచిన్‌.. ఈ హెయిర్‌ స్టైల్‌ ఎలా ఉంది బాస్‌ అంటూ ముందుకొచ్చాడు.  లాక్‌డౌన్‌ సమయంలో తనకు తాను చేసుకున్న హెయిర్‌స్టైల్‌ ఫోటోలను షేర్‌ చేశాడు. (తెలుసా... ఆట జరుగుతోంది అక్కడ!)

స్క్వేర్‌ కట్‌ షాట్లను కొట్టడంలో మాస్టర్‌ అయిన సచిన్‌.. తాజాగా హెయిర్‌కట్‌ను ట్రై చేశానన్నాడు.  ‘స్క్వేర్‌ కట్ల నుంచి.. నా హెయిర్‌ కట్ల వరకూ.. కొత్త ప్రయోగాలతో ఎప్పుడూ ఎంజాయ్‌ చేస్తా. నా న్యూలుక్‌ ఎలా ఉంది’ అని పేర్కొన్నాడు. క్రికెట్‌లో వంద అంతర్జాతీయ సెంచరీలతో అరుదైన రికార్డును సచిన్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తన ఆటతో దేశానికి ఎంతో పేరు తేవడమే కాకుండా కోట్లాది అభిమానులను సచిన్‌ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలోనే కొత్తగా కనిపించే యత్నం చేసి వాటిని అభిమానులతో పంచుకున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విరాళాలు ప్రకటించిన క్రీడాకారులలో సచిన్ కూడా ఉన్నారు.  తన వంతు సాయంగా రూ. 50లక్షల విరాళాన్ని ఇచ్చాడు. (అలా అయితే ప్రతీసారి సిక్స్‌ ఇచ్చేవాణ్ని: అక్తర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement