మూడు గెలిస్తే పతకం


మిక్స్‌డ్ డబుల్స్ ‘డ్రా’ విడుదల

తొలి రౌండ్‌లో ఆసీస్ జోడీతో సానియా-బోపన్న జంట ‘ఢీ’


 రియో డి జనీరో: రియో ఒలింపిక్స్ టెన్నిస్ ఈవెంట్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగం ‘డ్రా’ వివరాలను మంగళవారం విడుదల చేశారు. భారత్‌కు చెందిన సానియా మీర్జా-రోహన్ బోపన్న జంటకు నాలుగో సీడింగ్ లభించింది. గురువారం జరిగే తొలి రౌండ్‌లో సమంతా స్టోసుర్-జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) ద్వయంతో భారత జోడీ తలపడుతుంది. కేవలం 16 జోడీలు పాల్గొంటున్న ఈ ఈవెంట్‌లో మూడు విజయాలు సాధించిన జంటకు పతకం దక్కుతుంది.


తొలి రౌండ్‌ను దాటితే... క్వార్టర్ ఫైనల్లో మోనికా నికెలెస్కూ-ఫ్లోరిన్ మెర్జియా (రొమేనియా) లేదా ఫెరర్-కార్లా నవారో (స్పెయిన్)లతో సానియా-బోపన్న తలపడతారు. వీరి పార్శ్వంలోనే రెండో సీడ్ క్రిస్టినా మ్లాడెనోవిచ్-హెర్బర్ట్ (ఫ్రాన్స్) ద్వయం... వీనస్ విలియమ్స్-రాజీవ్ రామ్ (అమెరికా) జంటలు ఉన్నాయి. మరో పార్శ్వంలో టాప్ సీడ్ కరోలినా గార్సియా-మహుట్ (ఫ్రాన్స్); నాలుగో సీడ్ రాఫెల్ నాదల్-గార్బిన్ ముగురుజా (స్పెయిన్) జోడీలు ఉన్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top