టెస్టు ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌కు అగ్రస్థానం | Ravichandran Ashwin becomes number-one ranked Test all-rounder | Sakshi
Sakshi News home page

టెస్టు ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌కు అగ్రస్థానం

Nov 10 2013 12:52 AM | Updated on Sep 2 2017 12:28 AM

టెస్టు ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌కు అగ్రస్థానం

టెస్టు ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌కు అగ్రస్థానం

భారత స్పిన్నర్ అశ్విన్ ఇక ఆల్‌రౌండర్ల కోటాలో చేరినట్లే. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో సెంచరీతో అశ్విన్ ... ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌కు దూసుకొచ్చాడు.

దుబాయ్: భారత స్పిన్నర్ అశ్విన్ ఇక ఆల్‌రౌండర్ల కోటాలో చేరినట్లే. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో సెంచరీతో అశ్విన్ ... ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. అశ్విన్ ఏకంగా 81 రేటింగ్ పాయింట్లు మెరుగుపరుచుకుని 405 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
 
 బంగ్లాదేశ్ ఆటగాడు షకిబుల్ (362 పాయింట్లు), దక్షిణాఫ్రికా స్టార్ కలిస్ (332 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకుల్లో అశ్విన్ రెండు స్థానాలు మెరుగుపడి ఆరో ర్యాంక్‌కు చేరాడు. టెస్టుల్లో అద్భుతమైన అరంగేట్రం చేసిన రోహిత్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 63వ స్థానం, బౌలింగ్ ర్యాంకుల్లో షమీ 53వ స్థానం సంపాదించారు. భువనేశ్వర్ (87వ ర్యాంక్) కంటే షమీ మెరుగైన స్థానంలో ఉండటం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement