కోహ్లి: ఆయన ఫ్యాన్‌గా ఉబ్బితబ్బిబ్బయ్యాడు! | Pure fanboy moment for me, says virat kohli | Sakshi
Sakshi News home page

కోహ్లి: ఆయన ఫ్యాన్‌గా ఉబ్బితబ్బిబ్బయ్యాడు!

Oct 17 2017 3:32 PM | Updated on Oct 17 2017 3:39 PM

Pure fanboy moment for me, says virat kohli

ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ విషయంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి తిరుగులేదు. మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ తర్వాత అంతటి భారీ అభిమానగణం కోహ్లికి సొంతం అనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. తనకు ఎంతమంది ఫ్యాన్స్‌ ఉన్నా.. తాను కూడా ఎవరికో ఒకరికి అభిమాని అయి ఉంటాడు. తనకు ఇష్టమైన స్టార్‌ను చూసి ఉబ్బితబ్బిబ్బవుతాడు కదా! అదే విషయాన్ని కోహ్లి తాజాగా బయటపెట్టాడు. హృదయాన్ని హత్తుకునేలా పాడి.. సంగీతంలో ఓలలాడించే ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ అర్జిత్‌ సింగ్‌ అంటే తనకు చాలా ఇష్టమట. అతనికి కోహ్లి వీరాభిమాని అట.. అదే విషయాన్ని కోహ్లి తాజాగా ట్వీట్‌ చేశాడు.

'నిజమైన అభిమాన సందర్భం ఇది నాకు. ఎంత అద్భుతమైన వ్యక్తి ఇతను. ఇతనిలా మరెవరి స్వరమూ నన్ను కట్టిపడేయలేదు. గాడ్‌ బ్లెస్‌ యూ అర్జిత్‌' అంటూ కోహ్లి అర్జిత్‌ సింగ్‌తో దిగిన ఫొటో పెట్టి కామెంట్ పెట్టాడు.  

బాలీవుడ్‌ తార అనుష్కతో ప్రస్తుతం సహజీవనం చేస్తున్న విరాట్‌ కోహ్లికి బాలీవుడ్‌ నటులంటే చాలా ఇష్టం. ఆమీర్ ఖాన్‌తో ఓ టీవీ కార్యక్రమంలో ముచ్చటించిన కోహ్లి ఈ విషయాన్ని బయటపెట్టాడు. బాలీవుడ్‌ సినిమాలు, ముఖ్యంగా ఆమీర్‌ ఖాన్‌ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. అన్నట్టు దీపావళి పండుగ సందర్భంగా తన అభిమానులకు కానుక ఇస్తూ.. అనుష్కతో కోహ్లి దిగిన ఓ స్పెషల్‌ ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement