సాక్షి గెలిచినా | Pro-wrestling league, Sakshi Malik | Sakshi
Sakshi News home page

సాక్షి vs లిచినా...

Jan 6 2017 11:58 PM | Updated on Sep 5 2017 12:35 AM

సాక్షి గెలిచినా

సాక్షి గెలిచినా

ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌–2లో సాక్షి మలిక్‌ సారథ్యంలోని కలర్స్‌ ఢిల్లీ సుల్తాన్స్‌ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది.

న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌–2లో సాక్షి మలిక్‌ సారథ్యంలోని కలర్స్‌ ఢిల్లీ సుల్తాన్స్‌ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆ జట్టు 3–4 తేడాతో జైపూర్‌ నింజాస్‌ చేతిలో పరాజయం పాలైంది. జైపూర్‌ జట్టుకు ఈ సీజన్‌లో ఇది వరుసగా రెండో విజయం. టాస్‌ గెలిచిన జైపూర్‌ నింజాస్‌ 65 కేజీల పురుషుల విభాగాన్ని... ఢిల్లీ 53 కేజీల మహిళల విభాగాన్ని బ్లాక్‌ చేశాయి.

నింజాస్‌ జట్టులో ఎలిజ్బర్‌ (97 కేజీలు) 8–0తో సత్యవర్త్‌ కడియన్‌పై, జాకబ్‌ మకరష్‌విలి (74 కేజీలు) 10–7తో ప్రవీణ్‌ రాణాపై, జెన్నీ ఫ్రాన్సన్‌ (75 కేజీలు) 5–0తో అలీనాపై, వినోద్‌ కుమార్‌ (70 కేజీలు) 2–0తో డేవిడ్‌పై విజయం సాధించారు. ఢిల్లీ తరఫున మరియా స్టడ్‌నక్‌ (48 కేజీలు) 16–0తో రీతూ ఫోగట్‌పై, సాక్షి మలిక్‌ (58 కేజీలు) 16–0తో పూజ ధండపై, ఎర్డెన్‌బాట్‌ బెక్‌యార్‌ (57 కేజీలు) 2–1తో ఉత్కర్‌‡్ష కాలేపై గెలిచారు. శనివారం జరిగే మ్యాచ్‌లో ముంబై మహారథితో యూపీ దంగల్‌ తలపడుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement