క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల | prajala entered in quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల

Apr 17 2014 12:53 AM | Updated on Sep 2 2017 6:07 AM

అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ ఆసియా బి1 చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సత్తాచాటింది.

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ ఆసియా బి1 చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సత్తాచాటింది. సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఆమె డబుల్స్‌లో ఓజస్విని సింగ్‌తో కలిసి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూఢిల్లీలోని ఆర్.కె.ఖన్నా టెన్నిస్ స్టేడియంలో బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ప్రాంజల 6-2, 6-3తో ఏపీ సహచర క్రీడాకారిణి స్నేహ పడమటపై గెలుపొందింది.
 
 బాలికల డబుల్స్‌లో రెండో సీడ్ ప్రాంజల-ఓజస్వినీ జోడి 6-4, 6-1తో భారత్‌కే చెందిన దేవాన్షి భీంజియాని- జీల్ దేశాయ్ ద్వయంపై విజయం సాధించింది. మరో డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో నిధి సురపనేని- జెన్నిఫర్ లూకమ్ (భారత్) జంట 3-6, 3-6తో మూడో సీడ్ తమచన్ మొంకూంతోడ్- ప్లోబ్రంగ్ ప్లిప్యూచ్ (థాయ్‌లాండ్) జోడి చేతిలో పరాజయం చవిచూసింది. గురువారం జరిగే సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల థాయ్‌లాండ్‌కు చెందిన ఐదో సీడ్ తమచన్‌తో, డబుల్స్‌లో ప్రాంజల జోడి వసంతి షిండే-ధ్రుతి (భారత్) జంటతో తలపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement