క్వార్టర్‌ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక | Srivalli Rashmika in the quarter final | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక

Oct 25 2024 3:54 AM | Updated on Oct 25 2024 3:54 AM

Srivalli Rashmika in the quarter final

అడిలైడ్‌ (ఆ్రస్టేలియా): ప్లేఫోర్డ్‌ ఓపెన్‌ అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీలో భారత రెండో ర్యాంకర్, తెలంగాణ అమ్మాయ భమిడిపాటి శ్రీవల్లి రషి్మక క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రపంచ 303వ ర్యాంకర్‌ రష్మిక 6–4, 6–1తో గాబ్రియేలా (ఆ్రస్టేలియా)పై గెలిచింది. 

81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. డబుల్స్‌ విభాగంలో రష్మిక–వైదేహి (భారత్‌) జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో రషి్మక–వైదేహి ద్వయం 4–6, 6–7 (5/7)తో యుకీ నైటో–నహో సాటో (జపాన్‌) జంట చేతిలో ఓడిపోయింది.    

Advertisement
 
Advertisement
Advertisement