నాడు కోహ్లిని ధోని వద్దన్నాడు: వెంగ్‌సర్కార్‌

Picking Kohli ended my career: Vengsarkar - Sakshi

ముంబై: ప్రస్తుత భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని 2008లో జట్టులోకి ఎంపిక చేసిన కారణంతో తాను పదవి కోల్పోయానని అంటున్నాడు నాటి చీఫ్‌ సెలెక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌. కోహ్లిని తీసుకోవడం నాటి కెప్టెన్‌ ధోని, కోచ్‌ కిర్‌స్టెన్‌లకు ఏమాత్రం ఇష్టం లేదని తెలిపాడు. వీరిద్దరితో పాటు నాడు బీసీసీఐ కోశాధికారిగా ఉన్న శ్రీనివాసన్‌ తమిళనాడు ఆటగాడు బద్రీనాథ్‌ కోసం పట్టుబట్టారని వివరించాడు. ‘కోహ్లి అండర్‌–19 ప్రపంచకప్‌ గెలవడంతో  ఆస్ట్రేలియాలో అండర్‌–23 వర్ధమాన ఆటగాళ్ల టోర్నీకి అతడిని ఎంపిక చేశాం.

కోహ్లి ఓపెనర్‌గా వచ్చి çన్యూజిలాండ్‌ జట్టుపై 123 పరుగులు చేశాడు. దీంతో అతడు టీమిండియాలోకి రావడానికి శ్రీలంక సిరీసే సరైనదిగా భావించాం.  అయితే... కోహ్లి ప్రతిభ పూర్తిగా తెలియని కిర్‌స్టెన్, ధోని దీనిని వ్యతిరేకించారు. తమ చెన్నై ఫ్రాంచైజీ బ్యాట్స్‌మన్‌ బద్రీనాథ్‌ను పక్కన బెట్టాల్సి వస్తుండటంతో ధోని, శ్రీనివాసన్‌ కూడా ఇష్టపడలేదు. ఆ ఏడాది 800 పరుగులు చేసిన బద్రీనాథ్‌ సంగతేంటని  శ్రీనివాసన్‌ వాదించారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నన్ను పదవి నుంచి తప్పించారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top