కెనడా ఓపెన్‌ ఫైనల్లో కశ్యప్‌ | Parupalli Kashyap Enters Final of Canada Open | Sakshi
Sakshi News home page

కెనడా ఓపెన్‌ ఫైనల్లో కశ్యప్‌

Jul 8 2019 8:28 AM | Updated on Jul 8 2019 8:28 AM

Parupalli Kashyap Enters Final of Canada Open - Sakshi

పారుపల్లి కశ్యప్‌

కాల్గరి : ఎట్టకేలకు ఈ ఏడాది తొలిసారి ఓ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. కెనడా ఓపెన్‌ సూపర్‌–100 టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. ఈ ఏడాది ఇప్పటివరకు తొమ్మిది టోర్నీల్లో ఆడిన కశ్యప్‌ ఏ ఒక్క టోర్నీలోనూ ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకోలేకపోయాడు. కానీ కెనడా ఓపెన్‌లో మాత్రం ఆద్యంతం నిలకడగా రాణిస్తూ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. 70 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్‌ కశ్యప్‌ 14–21, 21–17, 21–18తో నాలుగో సీడ్‌ వాంగ్‌ జూ వీ (చైనీస్‌ తైపీ)పై సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ఫైనల్లో చైనా షట్లర్, ప్రపంచ 126వ ర్యాంకర్‌ లీ షి ఫెంగ్‌తో కశ్యప్‌ తలపడతాడు. 

Advertisement
 
Advertisement
Advertisement