ఓవరాల్ చాంప్ ఎంఆర్‌ఈసీడబ్ల్యూ | Overall Champ MRECW | Sakshi
Sakshi News home page

ఓవరాల్ చాంప్ ఎంఆర్‌ఈసీడబ్ల్యూ

Nov 2 2014 12:49 AM | Updated on Sep 2 2017 3:43 PM

ఓవరాల్ చాంప్ ఎంఆర్‌ఈసీడబ్ల్యూ

ఓవరాల్ చాంప్ ఎంఆర్‌ఈసీడబ్ల్యూ

దూలపల్లి: మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ మహిళా కళాశాల (ఎంఆర్‌ఈసీడబ్ల్యూ)లో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్ కాలేజీల స్పోర్ట్స్‌మీట్ శనివారం ముగిసింది.

దూలపల్లి: మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ మహిళా కళాశాల (ఎంఆర్‌ఈసీడబ్ల్యూ)లో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్ కాలేజీల స్పోర్ట్స్‌మీట్ శనివారం ముగిసింది. ఆతిథ్య ఎంఆర్‌ఈసీడబ్ల్యూ జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. బాస్కెట్‌బాల్, చెస్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్లలో ఎంఆర్‌ఈసీడబ్ల్యూ జట్లు విజేతగా నిలిచాయి. త్రోబాల్ ఈవెంట్‌లో బీవీఆర్‌ఐటీ గెలుపొందింది. ఎంఆర్‌ఈసీడబ్ల్యూ జట్టుకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై.మాధవీలత ట్రోఫీని అందజేశారు.

Advertisement

పోల్

Advertisement