జూన్ 11న విజేందర్ తొలి టైటిల్ బౌట్ | On June 11, the first title bout Vijender | Sakshi
Sakshi News home page

జూన్ 11న విజేందర్ తొలి టైటిల్ బౌట్

Feb 23 2016 1:09 AM | Updated on Sep 3 2017 6:11 PM

జూన్ 11న విజేందర్ తొలి టైటిల్ బౌట్

జూన్ 11న విజేందర్ తొలి టైటిల్ బౌట్

స్టార్ బాక్సర్ విజేందర్ తొలిసారిగా ప్రొఫెషనల్ టైటిల్ కోసం బరిలోకి దిగే బౌట్ ఎప్పుడనేది తేలింది.

న్యూఢిల్లీ: స్టార్ బాక్సర్ విజేందర్ తొలిసారిగా ప్రొఫెషనల్ టైటిల్ కోసం బరిలోకి దిగే బౌట్ ఎప్పుడనేది తేలింది. న్యూఢిల్లీలో జరిగే అవకాశం ఉన్న ఈ ఫైట్‌ను జూన్ 11న జరపాలని ప్రపంచ బాక్సింగ్ సంస్థ నిర్ణయించింది. ప్రొ సర్క్యూట్‌లో ఇప్పటిదాకా మూడు బౌట్స్‌లో తలపడి ఓటమి లేకుండా ఉన్నవిజేందర్ డబ్ల్యూబీవో మిడిల్‌వెయిట్ లేదా సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్ కోసం పోరాడనున్నాడు. ‘ఏ టైటిల్ అందుబాటులో ఉంటుందో చూడాల్సి ఉంది. తనకు సరైన ప్రత్యర్థిని వెతకడం ముఖ్యం. అన్నివిధాలా విజేందర్‌కు అనుకూల నిర్ణయం తీసుకుంటాం. ఇంతకుముందు ఈ ఫైట్‌ను సెప్టెంబర్‌లో జరపాలని భావించినా జూన్ సరైన సమయం అనిపించింది. సొంత గడ్డపై ఈ బౌట్ కోసం విజేందర్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు’ అని ఈ బాక్సర్ యూకే ప్రమోటర్స్‌కు చెందిన ఫ్రాన్సిస్ వారెన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement