
ఓంకార్ ఒటారికి కాంస్య పకతం
కామన్వెల్త్ గేమ్స్ మూడో రోజున వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ లిఫ్టర్ ఓంకార్ ఒటారి కాంస్య పకతం సాధించాడు.
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ మూడో రోజున వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ లిఫ్టర్ ఓంకార్ ఒటారి కాంస్య పకతం సాధించాడు. 69 కేజీలో విభాగంలో అతడీ పతకం సాధించాడు. దీంతో భారత్ పతకాల సంఖ్య 17కు చేరింది. ఇందులో ఐదు బంగారు, ఏడు రజతాలు, ఐదు కాంస్య పతకాలున్నాయి. 50 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఓంకార్ సాధించిన పతకం వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు ఆరో పతకం.
కాగా, మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం సాధిస్తుందనే అంచనాలున్న మీనా కుమారి నిరాశపరిచింది. 58 కేజీల విభాగంలో మీనా ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. స్నాచ్‌లో 83 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీలు మాత్రమే ఎత్తగలిగింది.