'సినిమా ధోనీ' ఎలా ఉంటాడంటే..? | MS Dhoni The Untold Story teaser is released today | Sakshi
Sakshi News home page

'సినిమా ధోనీ' ఎలా ఉంటాడంటే..?

Mar 16 2016 7:08 PM | Updated on Sep 3 2017 7:54 PM

'సినిమా ధోనీ' ఎలా ఉంటాడంటే..?

'సినిమా ధోనీ' ఎలా ఉంటాడంటే..?

ఒక సాదాసీదా టికెట్ కలెక్టర్‌ నుంచి.. క్రికెట్‌ను మతంగా భావించే దేశ జాతీయ జట్టుకు సారథిగా ఎదగడమంటే మాటలు కాదు.

ఒక సాదాసీదా టికెట్ కలెక్టర్‌ నుంచి.. క్రికెట్‌ను మతంగా భావించే దేశ జాతీయ జట్టుకు సారథిగా ఎదగడమంటే మాటలు కాదు. మైదానంలో మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌గా, ఆటలో ధనాధన్‌ ధోనీగా, భారత్‌కు రెండు ప్రపంచ్‌కప్‌లు అందించిన లెజెండరీ కెప్టెన్‌గా ప్రఖ్యాతిగాంచిన మహేంద్రసింగ్ ధోనీ జీవితంలో బయటి ప్రపంచానికి తెలియని ఒడిదుడుకులు ఎన్నో ఉన్నాయి.

రాంచీలోని ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి.. క్రికెటర్‌గా, కెప్టెన్‌గా భారత్ జట్టుకు అద్భుత విజయాలు అందించిన ధోనీ జీవితకథ త్వరలో సినిమాగా రాబోతున్నది. 'ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ'గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా బుధవారం విడుదలైంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్‌లో.. ధోనీగా సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు.

నీరజ్ పాండే దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుశాంత్‌తోపాటు కియరా అద్వానీ, అనుపమ్ ఖేర్‌, భూమికా చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా,  సుశాంత్ రాజ్‌పుత్ తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా షేర్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement