ఇప్పటికీ కోలుకోలేదు
టి20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో ఓటమి షాక్ నుంచి ఇంకా కోలుకోలేదని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ మహ్మదుల్లా చెప్పాడు.
	 భారత్‌తో ఓటమిపై మహ్మదుల్లా
	
	ఢాకా: టి20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో ఓటమి షాక్ నుంచి ఇంకా కోలుకోలేదని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ మహ్మదుల్లా చెప్పాడు. ఆ మ్యాచ్‌లో విజయానికి చివరి మూడు బంతుల్లో రెండు పరుగులు అవసరం కాగా... ముష్ఫికర్, మహ్మదుల్లా చెత్త షాట్లు ఆడి అవుట్ కావడంతో భారత్ సంచలనాత్మక విజయం సాధిం చింది.
	
	‘ఆ రోజు నేను ఆడిన చెత్త షాట్‌ని తలచుకుని ఇప్పటికీ బాధపడుతున్నా. ఓటమికి పూర్తి బాధ్య త నాదే. అభిమానులు నన్ను క్షమించాలి. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే  పరిణతితో ఆడతాను’ అని మహ్మదుల్లా చెప్పాడు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
