breaking news
Musphikar
-
‘అక్కడ మాత్రం మెరుగవ్వాలి’
హైదరాబాద్: నంబర్‌వన్ టెస్టు జట్టుగా ఎదిగి తిరుగులేని ప్రదర్శనతో ఎదురే లేకుండా భారత జట్టు కొనసాగుతోంది. కెప్టెన్ కోహ్లితో పాటు జట్టులో ప్రతీ ఒక్క సభ్యుడు తన స్థాయిలో చెలరేగిపోతున్నాడు. కానీ ఇలాంటి స్థితిలో తమలోనూ లోపం ఉందని కోహ్లి భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని అతను బంగ్లాదేశ్‌తో టెస్టు ముగిసిన అనంతరం వెల్లడించాడు. ప్రత్యర్థి రెండో ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చే విషయంలో తాము కాస్త ఆలస్యం చేస్తున్నామని అతను వ్యాఖ్యానించాడు. ‘బంగ్లాదేశ్ 8 వికెట్లు కోల్పోయిన తర్వాత మాలో కాస్త ఉత్సాహం తగ్గినట్లు అనిపించింది. వాస్తవానికి అలాంటి స్థితిలో అవకాశాలు అందిపుచ్చుకొని తొందరగా ముగించాలి. ఇలాంటి సమయంలో ప్రత్యర్థి కోలుకునే ప్రమాదం కూడా ఉంటుంది. మన ఉదాసీనతతో వారికి ఆ అవకాశం ఇవ్వరాదు. ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు ఈ విషయంలో మేం మెరుగు పడాల్సి ఉంది’ అని కోహ్లి అభిప్రాయపడ్డాడు. వరుసగా 19 మ్యాచ్‌లలో ఓటమి లేకుండా సాగడంలో జట్టు సమష్టి కృషి ఉందని సంతోషం వ్యక్తం చేశాడు. కొన్ని సార్లు ఒక్కో ఆటగాడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవకపోయినా, కీలక సమయంలో అతను వికెట్ తీసి ప్రత్యర్థి జోడీని విడదీసిన విషయం మరచిపోవద్దని... ఒకరిద్దరి వల్లే గెలుపు సాధ్యం కాదని అతను అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా తాను ఎదుగుతున్నానని చెప్పిన కోహ్లి... ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ చెలరేగిపోవడంలాంటి కీలక క్షణాల్లో ఫీల్డింగ్ ఏర్పాట్ల విషయంలో తాను కొత్త తరహా ఆలోచనలతో ముందుకు వెళుతున్నట్లు వెల్లడించాడు. ముష్ఫికర్ ఆటోగ్రాఫ్... హైదరాబాద్ టెస్టులో 250 వికెట్ల మైలురాయి చేరుకున్న భారత స్పిన్నర్ అశ్విన్ ఈ జ్ఞాపకాన్ని పదిలపర్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఉపయోగించిన బంతిపై బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఆటోగ్రాఫ్ చేసి అశ్విన్‌కు అందజేశాడు. -
ఇప్పటికీ కోలుకోలేదు
భారత్‌తో ఓటమిపై మహ్మదుల్లా ఢాకా: టి20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో ఓటమి షాక్ నుంచి ఇంకా కోలుకోలేదని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ మహ్మదుల్లా చెప్పాడు. ఆ మ్యాచ్‌లో విజయానికి చివరి మూడు బంతుల్లో రెండు పరుగులు అవసరం కాగా... ముష్ఫికర్, మహ్మదుల్లా చెత్త షాట్లు ఆడి అవుట్ కావడంతో భారత్ సంచలనాత్మక విజయం సాధిం చింది. ‘ఆ రోజు నేను ఆడిన చెత్త షాట్‌ని తలచుకుని ఇప్పటికీ బాధపడుతున్నా. ఓటమికి పూర్తి బాధ్య త నాదే. అభిమానులు నన్ను క్షమించాలి. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే పరిణతితో ఆడతాను’ అని మహ్మదుల్లా చెప్పాడు.