రైకోనెన్‌ రికార్డు 

Kimi Raikkonen: I'm free to race Sebastian Vettel - Sakshi

మోంజా (ఇటలీ): ఫెరారీ డ్రైవర్‌ కిమీ రైకోనెన్‌ ఫార్ములావన్‌ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. అత్యంత వేగంగా ల్యాప్‌ను పూర్తి చేసిన డ్రైవర్‌గా గుర్తింపు పొందాడు. ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో రైకోనెన్‌ ఒక నిమిషం 19.119 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ‘పోల్‌ పొజిషన్‌’ సాధించాడు.

ఈ క్రమంలో 2004లో విలియమ్స్‌ జట్టు డ్రైవర్‌ మోంటాయా (1ని:19.525 సెకన్లు) నెలకొల్పిన రికార్డును రైకోనెన్‌ బద్దలు కొట్టాడు. ఫెరారీకే చెందిన వెటెల్‌ రెండో స్థానంలో నిలువగా... మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్లు హామిల్టన్, బొటాస్‌ మూడు, నాలుగు స్థానాలతో రేసును ఆరంభిస్తారు. ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్‌ 8వ, 16వ స్థానాల నుంచి రేసు మొదలెడతారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top