తొలి సీజన్‌లో రన్నరప్‌గా నిలిచినా...
గువాహటి: తొలి సీజన్‌లో రన్నరప్‌గా నిలిచినా... ఈసారి పేలవ ప్రదర్శనతో అట్టడుగున కొనసాగుతున్న కేరళ బ్లాస్టర్స్‌కి కీలక విజయం దక్కింది. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ రెండో సీజన్‌లో భాగంగా ఆదివారం నార్త్‌ఈస్ట్ యునెటైడ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ 4-1తో విజయం సాధించింది.
దగ్నల్ (1, 76వ నిమిషాల్లో), లోబో (21), గెర్మన్ (75) గోల్స్ చేశారు. ఇందులో ఆట ప్రారంభ సెకన్లలోనే దగ్నల్ చేసిన గోల్ ఐఎస్‌ఎల్‌లో అత్యంత వేగవంతమైన గోల్‌గా నిలిచింది. నార్త్‌ఈస్ట్‌కు వెలెజ్ ఏకైక గోల్ అందించాడు.