'భారత ఫుట్బాల్ ముఖచిత్రం మారుతుంది' | ISL will change the face of Indian football says, Sachin Tendulkar | Sakshi
Sakshi News home page

'భారత ఫుట్బాల్ ముఖచిత్రం మారుతుంది'

Oct 13 2014 8:00 PM | Updated on Sep 2 2017 2:47 PM

'భారత ఫుట్బాల్ ముఖచిత్రం మారుతుంది'

'భారత ఫుట్బాల్ ముఖచిత్రం మారుతుంది'

ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) తో భారత ఫుట్బాల్ ముఖచిత్రం మారుతుందన్న ఆశాభావాన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తం చేశాడు.

గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) తో భారత ఫుట్బాల్ ముఖచిత్రం మారుతుందన్న ఆశాభావాన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తం చేశాడు. ఆదివారం ప్రారంభమైన ఐఎస్ఎల్ కు అద్భుత స్పందన వచ్చిందని పేర్కొన్నాడు. 

'ఇది కొత్త ఆరంభం. దీనికోసమే ప్రతిఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఆరంభ మ్యాచ్ లో రెండు జట్లు గొప్ప క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాయి. ప్రేక్షకుల స్పందన బాగుంది' అని సచిన్ అన్నాడు. తన టీమ్ కు మద్దతుగా సచిన్ ఇక్కడకు వచ్చాడు. సచిన్ సహ యజమానిగా ఉన్న కేరళ బ్లాస్టర్స్ జట్టుకు ఇంగ్లండ్ గోల్ కీపర్ డేవిడ్ జేమ్స్ నాయకత్వం వహిస్తున్నాడు. పీవీపీ వెంచర్స్తో కలిసి సచిన్ ఈ జట్టు కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement