ఇషాంత్ శర్మ బ్యాడ్ లక్ | Ishant Sharma out of first Test due to illness | Sakshi
Sakshi News home page

ఇషాంత్ శర్మ బ్యాడ్ లక్

Sep 20 2016 5:42 PM | Updated on Sep 4 2017 2:16 PM

ఇషాంత్ శర్మ బ్యాడ్ లక్

ఇషాంత్ శర్మ బ్యాడ్ లక్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ అనారోగ్యం కారణంగా న్యూజిలాండ్ తో జరగనున్న తొలి టెస్టుకు దూరమయ్యాడు.

కాన్పూర్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ అనారోగ్యం కారణంగా న్యూజిలాండ్ తో జరగనున్న తొలి టెస్టుకు దూరమయ్యాడు. చికెన్ గున్యా బారిన పడడంతో అతడు చరిత్రాక టెస్టులో ఆడే అవకాశం కోల్పోయాడు. అతడి స్థానంలో మరో బౌలర్ కావాలని కోచ్ అనిల్ కుంబ్లే అడగలేదు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్ జట్టులో ఉన్నారు. న్యూజిలాండ్ జట్టులోనూ ఆల్ రౌండర్ జేమ్స్ నిషామ్ పక్క ఎముక గాయం కారణంగా కాన్పూర్ టెస్టుకు దూరమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. స్వదేశానికి తిరిగి వెళ్లిపోయిన సౌతీ వన్డే సిరీస్ లో బరిలో దిగే అవకాశముంది.

72 టెస్టులు ఆడిన ఇషాంత్ శర్మ 36.71 సగటుతో 209 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ లో అతడు 8 వికెట్లు తీశాడు. ఈ నెల 22నుంచి న్యూజిలాండ్‌తో కాన్పూర్‌లో జరిగే టెస్టు టీమిండియాకు 500వ మ్యాచ్ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement