నాల్గో వన్డేలో భారత్ ఘనవిజయం | india won the 4th oneday | Sakshi
Sakshi News home page

నాల్గో వన్డేలో భారత్ ఘనవిజయం

Oct 22 2015 9:21 PM | Updated on Sep 3 2017 11:20 AM

నాల్గో వన్డేలో భారత్ ఘనవిజయం

నాల్గో వన్డేలో భారత్ ఘనవిజయం

నల్గో వన్డే లో భారత్ ఘన విజయం సాధించింది.

కీలక వన్డేలో భారత్ సమిష్టిగా రాణించింది. విజయ దశమి నాడు.. దక్షిణాఫ్రికాతో ఇక్కడ చిదంబరం స్టేడియంలో గురువారం జరిగిన నాలుగో వన్డేలో 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్ వీరోచిత సెంచరీ వృధా అయ్యింది.  107 బంతుల్లో 112 పరుగులు చేసి డివిలియర్స్ అవుట్ అయ్యాడు. 300 పరుగుల భారీలక్ష్యంతో బరిలో దిగిన సౌతాప్రికా పరుగుల వేటలో చతికల బడింది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. దీంతో 35 పరుగుల ఆధిక్యంతో భారత్ విజయం సాధించింది. అంతకు ముందు భారత్ 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఈ విజయంతో ఫ్రీడమ్ సిరీస్ ను 2-2 తో టీమిండియా సమం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement