టీమిండియా టార్గెట్ 329 | india set 329 runs target for australia | Sakshi
Sakshi News home page

టీమిండియా టార్గెట్

Mar 26 2015 12:41 PM | Updated on Sep 2 2017 11:26 PM

టీమిండియా టార్గెట్ 329

టీమిండియా టార్గెట్ 329

స్మిత్ సెంచరీ, ఫించ్ అర్థసెంచరీలతో రాణించడంతో టీమిండియాకు ఆస్ట్రేలియా పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

సిడ్నీ: స్మిత్ సెంచరీ, ఫించ్ అర్థసెంచరీలతో రాణించడంతో టీమిండియాకు ఆస్ట్రేలియా 329 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. 15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ ను స్మిత్, ఫించ్ నిలబెట్టారు. రెండో వికెట్ కు 182 బంతుల్లో 173 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 197 స్కోరు వద్ద వీరి భాగస్వామ్యాన్ని ఉమేష్ యాదవ్ విడదీశాడు. సెంచరీ వీరుడు స్మిత్(105)ను అవుట్ చేశాడు.

232 పరుగుల వద్ద విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్ వెల్ ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. 233 పరుగుల వద్ద ఫించ్ అవుటడవడంతో ఒక్క పరుగు తేడాతో ఆసీస్ 2 వికెట్లు చేజార్చకుంది. తర్వాత వరుసగా కెప్టెన్ క్లార్క్(10), ఫాల్కనర్(23), వాట్సన్(28) అవుటయ్యారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టాడు. మొహిత్ శర్మ 2 వికెట్లు తీశాడు. అశ్విన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement