భారత్‌కు రెండు రజతాలు | India gets two medals in Brazil International Badminton Cup | Sakshi
Sakshi News home page

భారత్‌కు రెండు రజతాలు

Mar 13 2018 10:53 AM | Updated on Mar 13 2018 10:53 AM

India gets two medals in Brazil International Badminton Cup - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్రెజిల్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ కప్‌లో హైదరాబాద్‌ క్రీడాకారులు సౌరభ్‌ శర్మ, కోన తరుణ్‌ రాణించారు. బ్రెజిల్‌లో జరిగిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో భారత్‌కు రెండు రజత పతకాలను అందించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత్‌కే చెందిన అనౌష్క పరీక్‌తో జతకట్టిన సౌరభ్‌ శర్మ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో సౌరభ్‌– అనౌష్క జంట 17–21, 14–21తో ఎవెంజి డ్రెమిన్‌–ఇవగెనియా డిమోవా (రష్యా) జంట చేతిలో ఓటమి పాలైంది.

అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో 21–15, 21–11తో మాథ్యూస్‌ వోట్‌–విన్సెంటే లోహాని (బ్రెజిల్‌)పై, క్వార్టర్స్‌లో 21–7, 21–8తో పౌలా వినిసియస్‌–తమిరీస్‌ శాంటోస్‌ (బ్రెజిల్‌)పై గెలుపొందారు. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సౌరభ్‌ శర్మ– కోన తరుణ్‌ జంట (భారత్‌) 7–21తో మొదటి గేమ్‌లో నైల్‌ యుకురా– జాసన్‌ ఆంథోని (కెనడా) జంట చేతిలో ఓడింది. ఈ దశలో గాయం కారణంగా భారత జంట మ్యాచ్‌ నుంచి తప్పుకోవడంతో కెనడాను విజయం వరించింది. అంతకుముందు సెమీస్‌లో తరుణ్‌–సౌరభ్‌ జోడి 21–13, 21–15తో రోడాల్ఫో రమిరెజ్‌– జొనాథన్‌ జంటపై, క్వార్టర్స్‌లో 21–14, 19–21, 21–15తో ఎవెంజి డ్రెమిన్‌–డెన్నిస్‌ గ్రాచెవ్‌ (రష్యా) జంటపై విజయం సాధించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement