breaking news
kona tarun
-
భారత్‌కు రెండు రజతాలు
సాక్షి, హైదరాబాద్: బ్రెజిల్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ కప్‌లో హైదరాబాద్ క్రీడాకారులు సౌరభ్ శర్మ, కోన తరుణ్ రాణించారు. బ్రెజిల్లో జరిగిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత్‌కు రెండు రజత పతకాలను అందించారు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత్‌కే చెందిన అనౌష్క పరీక్‌తో జతకట్టిన సౌరభ్ శర్మ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో సౌరభ్– అనౌష్క జంట 17–21, 14–21తో ఎవెంజి డ్రెమిన్–ఇవగెనియా డిమోవా (రష్యా) జంట చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో 21–15, 21–11తో మాథ్యూస్ వోట్–విన్సెంటే లోహాని (బ్రెజిల్)పై, క్వార్టర్స్‌లో 21–7, 21–8తో పౌలా వినిసియస్–తమిరీస్ శాంటోస్ (బ్రెజిల్)పై గెలుపొందారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో సౌరభ్ శర్మ– కోన తరుణ్ జంట (భారత్) 7–21తో మొదటి గేమ్‌లో నైల్ యుకురా– జాసన్ ఆంథోని (కెనడా) జంట చేతిలో ఓడింది. ఈ దశలో గాయం కారణంగా భారత జంట మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో కెనడాను విజయం వరించింది. అంతకుముందు సెమీస్‌లో తరుణ్–సౌరభ్ జోడి 21–13, 21–15తో రోడాల్ఫో రమిరెజ్– జొనాథన్ జంటపై, క్వార్టర్స్‌లో 21–14, 19–21, 21–15తో ఎవెంజి డ్రెమిన్–డెన్నిస్ గ్రాచెవ్ (రష్యా) జంటపై విజయం సాధించింది. -
సిక్కి రెడ్డి-తరుణ్ జంటకు టైటిల్
రుమేనియా ఇంటర్నేషనల్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోన్న తెలంగాణ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి తన ఖాతాలో మరో టైటిల్‌ను జమ చేసుకుంది. హైదరాబాద్‌కే చెందిన కోనా తరుణ్‌తో కలిసి సిక్కి రెడ్డి రుమేనియా ఇంటర్నేషనల్ సిరీస్‌లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుం ది. తిమిసోరా పట్టణంలో ఆదివారం జరిగిన ఫైనల్లో సిక్కి రెడ్డి-తరుణ్ ద్వయం 11-7, 11-8, 11-4తో రెండో సీడ్ జోన్స్ రఫ్లీ జాన్సెన్-సిస్టియా జోటీ జాన్సెన్ (జర్మనీ) జంటను ఓడించింది.