‘బ్రిడ్జ్‌’లో 2 పతకాలు ఖాయం | India assured of two medals in bridge | Sakshi
Sakshi News home page

‘బ్రిడ్జ్‌’లో 2 పతకాలు ఖాయం

Aug 26 2018 5:24 AM | Updated on Aug 26 2018 5:24 AM

India assured of two medals in bridge - Sakshi

ఆసియా క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన ‘బ్రిడ్జ్‌’ క్రీడలో భారత్‌ రెండు పతకాలు ఖాయం చేసుకుంది. భారత పురుషుల, మిక్స్‌డ్‌ టీమ్‌లు సెమీఫైనల్‌ చేరుకోవడంతో కనీసం రెండు పతకాలు మన ఖాతాలో చేరాయి. 13 క్వాలిఫికేషన్‌ రౌండ్లు ముగిసిన తర్వాత పురుషుల బ్రిడ్జ్‌ జట్టు నాలుగో స్థానంలో  నిలవగా, మిక్స్‌డ్‌ విభాగంలో 7 క్వాలిఫయింగ్‌ రౌండ్ల అనంతరం మన జట్టు అగ్రస్థానం సాధించింది. సెమీస్‌లో ఓడినా భారత్‌కు కనీసం కాంస్యం దక్కుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement