పింక్‌బాల్‌.. అడిలైడ్‌ టూ కోల్‌కతా

How Pink Ball Have Travelled Across The Globe From Adelaide To Kolkata - Sakshi

ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచం మొత్తం టీమిండియా- బంగ్లాదేశ్‌ల మధ్య జరిగే రెండో టెస్టుపైనే దృష్టిని కేంద్రీకరించింది.ఎందుకంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా మొదటిసారి పింక్‌బాల్‌తో ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు అభిమానులతో పాటు ఇరుదేశాల క్రికెటర్లు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  నవంబర్‌ 22న ప్రారంభం కానున్న డే- నైట్‌ టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్జెన్స్‌ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.పింక్‌ బాల్‌కు సంబంధించి మొదటి డై నైట్‌ టెస్టు మ్యాచ్‌ 2015లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ మధ్య అడిలైడ్‌లో జరిగింది. దీంతో అడిలైడ్‌లో మొదలైన పింక్‌ బాల్‌ కథ ఇప్పుడు కోల్‌కతాకి చేరింది.

అయితే ఇది ఇండియాలోకి అడుగుపెట్టడానికి మాత్రం నాలుగేళ్లు పట్టింది.  అయితే ఐసీసీ 2015లోనే డై నైట్‌ టెస్టులకు అనుమతినిచ్చినా బీసీసీఐ, టీమిండియా వ్యతిరేకించడంతో ఉపఖండంలో పింక్‌ బాల్‌ కల నెరవేరలేదు. తాజాగా సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడంతో మరోసారి డే నైట్‌ టెస్టు ప్రతిపాదన ముందుకు వచ్చింది. కాగా కోహ్లి- గంగూలీ కలిసిన మొదటి భేటీలోనే గంగూలీ డే నైట్‌ టెస్టును ప్రతిపాదించడం, కోహ్లి అందుకు ఒప్పుకోవడం చకచకా జరిగిపోయింది.

అడిలైడ్‌ టు కోల్‌కతా
ఇప్పటివరకు టెస్టు చరిత్రలో 11 డే నైట్‌ టెస్టులు జరగగా  ఆస్ట్రేలియా అత్యధికంగా 5 డే నైట్‌ టెస్టులు ఆడింది. తర్వాతి స్థానాల్లో శ్రీలంక(3), వెస్టిండీస్‌(3), శ్రీలంక (3), ఇంగ్లండ్‌ (3), పాకిస్తాన్‌(2), దక్షిణాఫ్రికా ( 2), జింబాబ్వే(1)ఘాడాయి. తాజాగా ఇప్పుడు 12వ డే పైట్‌ టెస్టు టీమిండియా, బంగ్లాదేశ్‌ల మధ్య జరగనుంది. కాగా, 11 డే నైట్‌ టెస్టులు జరిగిన వేదికలను ఒకసారి చూస్తే..  అడిలైడ్‌ , దుబాయ్‌, అడిలైడ్ ‌, బ్రిస్బేన్‌, బర్మింగ్‌ హమ్‌,దుబాయ్‌, అడిలైడ్‌, పోర్ట్‌​ ఎలిజెబెత్‌(సెంట్‌ జార్జ్‌ పార్క్), ఆక్లాండ్‌, బ్రిడ్జ్‌టౌన్‌, బ్రిస్బేన్‌ నగరాలు ఆతిథ్యమిచ్చాయి. ఇప్పుడు 12వ డే నైట్‌ టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ ఆతిథ్యమివ్వనుంది.

దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా మ్యాచ్‌కు సంబంధించి పలు విశేషాలు ఉన్నాయి. మ్యాచ్‌లో టాస్‌కు ముందు  ఆర్మీ బలగాలు పారాట్రూపర్స్‌లో వచ్చి ఇరు కెప్టెన్లకు రెండు పింక్‌ బాల్స్‌ను అందజేయనున్నారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాతో కలిసి ఈడెన్‌గార్డెన్‌లోని సంప్రదాయ బెల్‌ను మోగించి మ్యాచ్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మ్యాచ్‌కు తరలిరానున్న సచిన్‌ టెండూల్కర్‌, ఒలింపియన్‌ అభినవ్‌ బింద్రా, టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు, 6 సార్లు మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌ మేరీకోమ్‌లను ఘనంగా సత్కరించనున్నట్లు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌) సెక్రటరీ అవిషేక్‌ దాల్మియా తెలిపారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top