జర్మనీపై గెలిచి... కాంస్యంతో మెరిసి

Hockey World League Final: India beat Germany 2-1 to win bronze - Sakshi

హాకీ వరల్డ్‌ లీగ్‌ ఫైనల్స్‌ టోర్నీలో టీమిండియాకు మూడో స్థానం

టైటిల్‌ నిలబెట్టుకున్న ఆస్ట్రేలియా  

భువనేశ్వర్‌: సొంతగడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్‌ లీగ్‌ (హెచ్‌డబ్ల్యూఎల్‌) ఫైనల్స్‌ టోర్నీలో భారత్‌ కాంస్య పతకంతో మెరిసింది. ఒలింపిక్స్, ప్రపంచ మాజీ చాంపియన్‌ జర్మనీతో ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో టీమిండియా 2–1 గోల్స్‌ తేడాతో గెలిచింది. ఆట 21వ నిమిషంలో ఎస్‌వీ సునీల్‌ గోల్‌తో భారత్‌ ఖాతా తెరువగా... 36వ నిమిషంలో మార్క్‌ అపెల్‌ గోల్‌తో జర్మనీ స్కోరును సమం చేసింది. మ్యాచ్‌ మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా... 54వ నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌గా మలిచి టీమిండియాకు 2–1తో ఆధిక్యాన్ని అందించాడు. కాంస్య పతకం నెగ్గిన భారత జట్టు సభ్యులందరికీ రూ. 10 లక్షల చొప్పున నగదు పురస్కారం అందజేస్తామని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. మరోవైపు ఫైనల్లో విశ్వవిజేత ఆస్ట్రేలియా 2–1తో రియో ఒలింపిక్స్‌ విజేత అర్జెంటీనాను ఓడించి వరుసగా రెండోసారి హెచ్‌డబ్ల్యూఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top