కామన్వెల్త్‌ గేమ్స్‌: పసిడి సాధించిన హీనా | Heena Sidhu Wins Gold Medal In CWG 2018 | Sakshi
Sakshi News home page

Apr 10 2018 11:49 AM | Updated on Apr 10 2018 11:08 PM

Heena Sidhu Wins Gold Medal In CWG 2018 - Sakshi

హీనా సిద్దు (ఫైల్‌ ఫొటో​)

గోల్డ్‌కోస్ట్‌ : కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ పసిడి పతకాల జోరు కొనసాగుతోంది. ఆరో రోజు ఈవెంట్‌లో భాగంగా మంగళవారం మహిళల 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత స్టార్‌ షూటర్‌ హీనా సిద్దు స్వర్ణం కైవసం చేసుకుంది. 38 రికార్డు స్కోర్‌ నమోదు చేయడంతో హీనాకు పసిడి ఖాయమైంది. ఇప్పటికే 10మీటర్ల విభాగంలో హీనా రజతం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కామన్వెల్త్ 2018లో భారత్‌కి రెండు పతకాలు అందించిన తొలి క్రీడాకారిణిగా హీనా సిద్దూ రికార్డుకెక్కింది. దీంతో​ భారత్‌ స్వర్ణాల సంఖ్య 11కు చేరగా 4 రజతాలు, 5 కాంస్యాలతో మొత్తం మెడల్స్‌ సంఖ్య 20కి చేరింది. ప్రస్తుతం భారత్‌ పతకాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement