హరికృష్ణ ఓటమి | Harikrishna defeat | Sakshi
Sakshi News home page

హరికృష్ణ ఓటమి

Apr 23 2017 1:45 AM | Updated on Sep 5 2017 9:26 AM

గషిమోవ్‌ స్మారక సూపర్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ తొలి పరాజయాన్ని చవిచూశాడు.

షామ్‌కిర్‌ (అజర్‌బైజాన్‌): గషిమోవ్‌ స్మారక సూపర్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ తొలి పరాజయాన్ని చవిచూశాడు. పావెల్‌ ఎల్జానోవ్‌ (ఉక్రెయిన్‌)తో శనివారం జరిగిన రెండో రౌండ్‌ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హరికృష్ణ 54 ఎత్తుల్లో ఓడిపోయాడు. పది మంది సూపర్‌ గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో రెండో రౌండ్‌ తర్వాత హరికృష్ణ అర పాయింట్‌తో 9వ స్థానంలో ఉన్నాడు.
 
రన్నరప్‌ సెంథిల్‌
చెన్నై: దక్షిణాఫ్రికాలో ముగిసిన వెస్ట్‌ రాండ్‌ ఓపెన్‌ స్క్వాష్‌ టోర్నీలో భారత ప్లేయర్‌ సెంథిల్‌ కుమార్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో సెంథిల్‌  8–11, 3–11, 8–11తో ఎల్‌షిర్బిని (ఈజిప్ట్‌) చేతిలో ఓడిపోయాడు. గతవారం సెంథిల్‌ పార్క్‌వ్యూ ఓపెన్‌ ఫైనల్లోనూ ఎల్‌షిర్బిని చేతిలోనే ఖంగుతిన్నాడు.

Advertisement

పోల్

Advertisement