ప్రిక్వార్టర్స్‌లో సిరిల్‌ వర్మ | Harikrishna among favourites in Shenzhen-Longgang chess tourney | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో సిరిల్‌ వర్మ

Mar 23 2017 1:24 AM | Updated on Sep 5 2017 6:48 AM

ప్రిక్వార్టర్స్‌లో సిరిల్‌ వర్మ

ప్రిక్వార్టర్స్‌లో సిరిల్‌ వర్మ

వియత్నాం ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ కప్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సిరిల్‌ వర్మ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు.

హనోయ్‌ (వియత్నాం): వియత్నాం ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ కప్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సిరిల్‌ వర్మ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో 12వ సీడ్‌ సిరిల్‌ వర్మ 21–15, 22–24, 21–7తో లె డక్‌ ఫాట్‌ (వియత్నాం)పై కష్టపడి గెలిచాడు. అంతకుముందు తొలి రౌండ్‌లో సిరిల్‌ 21–8, 21–10 జాస్పర్‌ వూన్‌ చాయ్‌ యు (బ్రూనై)పై విజయం సాధించాడు. భారత్‌కే చెందిన బోధిత్‌ జోషి, అభిషేక్‌ యెలెగార్‌ రెండో రౌండ్‌లో ఓడిపోగా... చిరాగ్‌ సేన్‌ తొలి రౌండ్‌లోనే పరాజయం పాలయ్యాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో మూడో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌–మనీషా ద్వయం 21–23, 8–21తో వాంగ్‌ సిజి–నీ బోవెన్‌ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది.

Advertisement

పోల్

Advertisement