 
															పనిమనిషిగా మారిన గోల్డ్ మెడలిస్ట్
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో బంగారు పతక విజేత రిషూ మిట్టల్ స్కూలు ఫీజు చెల్లించడం కోసం పనిమనిషిగా మారిపోయింది.
	చండీఘడ్: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో  బంగారు పతక విజేత రిషూ మిట్టల్  స్కూలు ఫీజు చెల్లించడం కోసం పనిమనిషిగా  మారిపోయింది.  ఒకప్పుడు బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థులను మట్టికరిపించి విజేత గా నిలిచిన  రిషూ  పదవ తరగతి ఫీజు కూడా కట్టలేని పేదరికంతో కొట్టుమిట్టాడుతోంది.  మేరీకోమ్ కావాలని కలలు కన్న ఈ బాక్సర్ పనిమనిషిగా మారడం సంచలనం సృష్టించింది.
	
	రిషూ మిట్టల్ కోచ్  రాజేందర్ సింగ్ అందించిన వివరాల ప్రకారం హర్యానా కైతాల్కు చెందిన  రిషూ మిట్టల్ 2014లో స్టేట్ లెవల్ ఛాంపియన్ షిప్లో గోల్డ్ మెడల్  గెలుచుకుంది. గ్వాలియర్లో జరిగిన జాతీయపోటీల్లో కూడా హర్యానా తరపున ఆమె పాల్గొంది.  ప్రస్తుతం ఆమె  10వ తరగతి ఫీజు కట్టలేని దయనీయ  పరిస్థితిలో ఉంది. అందుకే ఆమె ఇపుడు నాలుగు ఇళ్లల్లో పాచిపని చేసుకోవడానికి సిద్ధపడింది.  ఇదివరకే తల్లిదండ్రులను కోల్పోయిన మిట్టల్ అన్నయ్య కూడా ఓ చిరుద్యోగి.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
