వచ్చే ఐపీఎల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు శిఖర్ ధావన్‌ను తమ వద్దే కొనసాగించుకోవాలని భావిస్తోంది.
కోల్‌కతాతోనే గంభీర్
న్యూఢిల్లీ: వచ్చే ఐపీఎల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు శిఖర్ ధావన్‌ను తమ వద్దే కొనసాగించుకోవాలని భావిస్తోంది. 2013 ఐపీఎల్‌లో జట్టుతో ఆలస్యంగా చేరినా ధావన్ చెలరేగి టీమ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
అతనితో పాటు డేల్ స్టెయిన్, అమిత్ మిశ్రా, తిసార పెరీరాలను కూడా రైజర్స్ కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్‌లోని వివిధ జట్లు తాము కొనసాగించే ఆటగాళ్ల జాబితాను ఈ నెల 10లోగా బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది. గత సీజన్‌లో జట్టు విఫలమైనా కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ కెప్టెన్ గౌతం గంభీర్‌ను కొనసాగించే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. గంభీర్‌తో పాటు సునీల్ నరైన్ కూడా కొనసాగే అవకాశం ఉంది. షకీబ్ అల్‌హసన్, మనోజ్ తివారీల విషయంలో డోలాయమానంలో ఉంది.