'ప్రధాని నన్ను ఉత్తేజపరిచారు' | Feeling motivated having a discussion on future of boxing in our country | Sakshi
Sakshi News home page

'ప్రధాని నన్ను ఉత్తేజపరిచారు'

Mar 23 2016 2:45 PM | Updated on Aug 15 2018 2:20 PM

'ప్రధాని నన్ను ఉత్తేజపరిచారు' - Sakshi

'ప్రధాని నన్ను ఉత్తేజపరిచారు'

ఇప్పటివరకు పోటీపడిన నాలుగు బౌట్‌లలోనూ నాకౌట్ విజయాలు నమోదు చేసిన ప్రొఫెషనల్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్.

న్యూఢిల్లీ: ఇప్పటివరకు పోటీపడిన నాలుగు బౌట్‌లలోనూ నాకౌట్ విజయాలు నమోదు చేసిన ప్రొఫెషనల్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్. చివరగా అలెగ్జాండర్ హోర్వత్ (హంగేరి)తో జరిగిన బౌట్ లో విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో అడుగుపెట్టిన ఈ బాక్సర్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. ఈ సందర్భంగా కొన్ని విశేషాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మోదీని కలవడానికి వెళ్తున్నానంటూ తొలుత ట్వీట్ చేసిన విజేందర్, ప్రధానిని కలిసి బాక్సింగ్ గురించి చర్చించినట్లు ట్వీట్ లో రాసుకొచ్చాడు.

ప్రధానిని కలిసిన తర్వాత చాలా ప్రేరణ పొందినట్లు, ఆయన తనను ఉత్తేజాన్ని కలిగించారని, భారత్ లో ఇక ముందు బాక్సింగ్ ఆట ఎలా ఉండబోతుందన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు విజేందర్ తెలిపాడు. ప్రధానిని కలిసినందకు తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. తన తదుపరి బౌట్ ఏప్రిల్ 2న ఉండగా, ఆ బౌట్ ను 30వ తేదీకి మార్చుకున్నట్లు ఇటీవలే పేర్కొన్నాడు. లండన్ లోని కాపర్ బాక్స్ ఎరినాలో తన ఐదో బౌట్ జరగుతుందని అక్కడ కూడా మీ అందరి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నానని రెండు రోజుల కిందట ట్వీట్ లో వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement