ఓటమితో మొదలు  | Fed Cup Asia: india loss the match | Sakshi
Sakshi News home page

ఓటమితో మొదలు 

Feb 8 2018 1:28 AM | Updated on Feb 8 2018 1:28 AM

Fed Cup Asia: india loss the match - Sakshi

అంకిత రైనా

న్యూఢిల్లీ: అంకిత రైనా సంచలన విజయం సాధించినప్పటికీ... ఫెడ్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1లో భారత్‌కు శుభారంభం లభించలేదు. చైనాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 1–2తో ఓడిపోయింది. తొలి సింగిల్స్‌లో కర్మన్‌కౌర్‌ థండి 2–6, 2–6తో ప్రపంచ 125వ ర్యాంకర్‌ యఫాన్‌ వాంగ్‌ చేతిలో ఓటమి పాలైంది.

రెండో సింగిల్స్‌లో ప్రపంచ 253వ ర్యాంకర్‌ అంకిత రైనా 6–3, 6–2తో 120వ ర్యాంకర్‌  లిన్‌ జును బోల్తా కొట్టించడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్‌ మ్యాచ్‌లో అంకిత రైనా–ప్రార్థన తొంబారే ద్వయం 2–6, 6–7 (1/7)తో వాంగ్‌–జావోజువాన్‌ యాంగ్‌ జంట చేతిలో పరాజయం పాలైంది. గురువారం జరిగే మ్యాచ్‌లో కజకిస్తాన్‌తో భారత్‌ ఆడుతుంది.    

Advertisement
 
Advertisement
Advertisement