ప్రపంచ బ్యాడ్మింటన్ టీమ్ మిక్స్‌డ్ చాంపియన్‌షిప్ సుదిర్మన్ కప్‌లో భారత్‌కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా ఈవెంట్‌కు ఈసారి చైనా ఆతిథ్యమివ్వనుంది.
డాంగువాన్ (చైనా): ప్రపంచ బ్యాడ్మింటన్ టీమ్ మిక్స్‌డ్ చాంపియన్‌షిప్ సుదిర్మన్ కప్‌లో భారత్‌కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా ఈవెంట్‌కు ఈసారి చైనా ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది మే 10 నుంచి 17 వరకు జరిగి ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన ‘డ్రా’ వివరాలు సోమవారం విడుదల చేశారు. గ్రూప్ 1డిలో దక్షిణ కొరియా, మలేసియా జట్లతో భారత్‌కు చోటు కల్పించారు. ప్రతి రౌండ్‌లో ఐదు మ్యాచ్‌లు (పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్) జరుగుతాయి. ఐదింటిలో మూడు నెగ్గినవారికి విజయం ఖాయమవుతుంది.