భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్... ఓ 25 మంది అనాథ పిల్లలకు క్రికెట్‌లో మెళకువలు నేర్పాడు. మంగళవారం ఏర్పాటు చేసిన ‘క్యాంప్ విత్ ద చాంప్’ కార్యక్రమంలో భాగంగా అతను రోజంతా పిల్లలకు క్రికెట్ పాఠాలు చెబుతూ గడిపాడు.
బెంగళూరు: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్... ఓ 25 మంది అనాథ పిల్లలకు క్రికెట్‌లో మెళకువలు నేర్పాడు. మంగళవారం ఏర్పాటు చేసిన ‘క్యాంప్ విత్ ద చాంప్’ కార్యక్రమంలో భాగంగా అతను రోజంతా పిల్లలకు క్రికెట్ పాఠాలు చెబుతూ గడిపాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో, టెలికామ్ బ్రాండ్ ఐడియా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఆటకు సంబంధించిన ప్రాథమికాంశాలను నేర్చుకోవాలనుకునే వారికి నియమ నిబంధనలను తెలియజేస్తూ కొన్ని వీడియోలను రూపొందించారు. మరోవైపు సెహ్వాగ్, జహీర్, గంభీర్‌లాంటి సీనియర్ ఆటగాళ్లు జాతీయ జట్టులోకి తిరిగి వస్తారని ద్రవిడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. విండీస్‌తో తలపడే భారత్ ‘ఎ’ జట్టులో ఈ ముగ్గురికి చోటు దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవకాశాన్ని వాళ్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు.