కర్ట్‌లీ ఆంబ్రోస్‌ డ్యాన్స్‌ వీడియో వైరల్‌

Curtly Ambrose Shows His Footwork On Dance Floor, Video Goes Viral - Sakshi

సిడ్నీ: కర్ట్‌లీ ఆంబ్రోస్‌.. పాత తరం క్రికెట్ అభిమానులకు ఈ పేరు బాగా సుపరిచితం. పేస్ బౌలింగ్‌లో ఓ సరికొత్త ఒరవడిని సృష్టించిన ఈ దిగ్గజ బౌలర్‌..  తన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియన్‌ డ్యాన్స్‌ షోలో 55 ఏళ్ల ఆంబ్రోస్‌ చేసిన డ్యాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తన డ్యాన్స్‌ భాగస్వామితో కలిసి ప్రఖ్యాత గాయకుడు 'ఎడ్‌ షీరాన్'‌ ఫేమస్‌ ట్రాక్‌ 'పర్‌ఫెక్ట్'కు ఆంబ్రోస్‌ వేసిన స్టెప్పులు అదుర్స్ అనిపించాయి.

ఆంబ్రోస్‌ డ్యాన్స్ చేసిన వీడియోని వెస్టిండిస్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.  ‘మాకు కూడా కొన్ని స్టెప్పులు మిగల్చండి సార్‌’ అని కామెంట్‌ విండీస్‌ బోర్డు..’ మీరు ఆంబ్రోస్‌ ఓట్‌ చేయండి’ అని ట్వీట్‌ చేసింది. ఏదో విభిన్నంగా చేయాలన్న ఆలోచనతోనే రియాల్టీ షోలో పాల్గొన్నట్టు ఆంబ్రోస్‌ చెప్పాడు.

ఈ వీడియోని చూసిన ఓ నెటజన్ ‘ఇదే వేగంతో క్రికెట్ ఆడేప్పుడు పాదాలు కదిలించి ఉంటే అతడి పేరు మీద మరిన్ని పరుగులు నమోదయ్యేవి’ అని సరదాగా ట్వీట్ చేశాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top