టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై | chennai super kings won the toss and elected to field first | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

May 24 2015 7:33 PM | Updated on Sep 3 2017 2:37 AM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

ఐపీఎల్-8లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

కోల్ కతా: ఐపీఎల్-8లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న ఫైనల్ పోరులో  చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సంచలన విజయాలతో ఫైనల్ కు చేరిన ఇరు జట్లు తుదిపోరులో ఆమీతుమీ తేల్చుకోవడానికి సన్నద్ధమయ్యాయి. రెండు జట్ల బలబలాలను పరిశీలిస్తే చెన్నై కంటే ముంబై పటిష్టంగా ఉంది.  కాగా, క్వాలిఫయర్ -2లో  మైక్ హస్సీ బ్యాటింగ్ చలవతో  బెంగళూర్ ను మట్టికరిపించి ఫైనల్ కు చేరిన చెన్నై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు క్వాలిఫయర్ -1లో చెన్నై ను ఓడించి ముంబై ఇండియన్స్ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.

 

ఫైనల్ సమరానికి కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదిక సిద్ధమైంది. ఈ రెండు జట్లు ఫైనల్లో రెండుసార్లు తలపడగా.. చెరోసారి విజయం సాధించాయి. ముంబై ఫైనల్ చేరిన ప్రతిసారీ చెన్నైతోనే తలపడింది. 2009లో ముంబైపై చెన్నై గెలవగా.. 2013లో చెన్నైపై ముంబై ఇండియన్స్ గెలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement