బుడ్డోడి చేతిలో అలీ మట్టికరిచిన వేళ! | Boxing match between Muhammad Ali and kid will make you laugh | Sakshi
Sakshi News home page

బుడ్డోడి చేతిలో అలీ మట్టికరిచిన వేళ!

Jun 4 2016 3:34 PM | Updated on Sep 4 2017 1:40 AM

బుడ్డోడి చేతిలో అలీ మట్టికరిచిన వేళ!

బుడ్డోడి చేతిలో అలీ మట్టికరిచిన వేళ!

లెజండరీ బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ తిరిగిరాని లోకాలకు వెళ్లడం క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.

లెజండరీ బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ తిరిగిరాని లోకాలకు వెళ్లడం క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 74 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస వదిలిన ఆ అలుపులేని యోధుడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కన్నీటి నివాళులర్పిస్తున్నారు.

ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి ప్రపంచంలోనే అత్యుత్తమ బాక్సర్‌గా పేరు తెచ్చుకున్న మహమ్మద్ అలీ తన వ్యక్తిత్వంతో అభిమానుల మనస్సులనూ దోచుకున్నాడు. ఆయన అంటే పెద్దవారే కాదు పిల్లలు పడిచచ్చేవారు. అందుకు ఉదాహరణ ఈ వీడియో!

అంతటి మహాయోధుడిని ఓ బుడ్డుడో బాక్సింగ్‌ రింగులో మట్టికరింపించాడు. బుడ్డోడి బాక్సింగ్ పంచులు తట్టుకోలేక అలీ చేతులెత్తేశాడు. దీంతో రిఫరీ వచ్చి ఆ చిన్నారి విజయం సాధించినట్టు ప్రకటించాడు. మూడుసార్లు ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్‌గా నిలిచిన అలీ కోరి మరీ బుడ్డోడి చేతిలో పంచులు తింటుంటే చూసేవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఓ మ్యాచ్‌ సందర్భంగా సరదా కోసం జరిగిన ఫైట్‌ ఇది.. మహమ్మద్ అలీకి పిల్లలపై ఉన్న ప్రేమను ఇది చాటుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement