
రోహిత్ శర్మ, మార్కండే, ఉమేశ్ యాదవ్‌లకు జట్టులో చోటు దక్కలేదు.
బెంగళూరు: భారత్‌తో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగనుంది. తమ జట్టులో ఎటువంటి మార్పులు లేవని ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తెలిపాడు. టీమిండియాలో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. రోహిత్ శర్మ, మార్కండే, ఉమేశ్ యాదవ్‌లకు జట్టులో చోటు దక్కలేదు. శిఖర్ ధావన్, విజయ శంకర్, సిద్ధార్థ కౌల్ తుది జట్టులో స్థానం సంపాదించారు.
విశాఖపట్నంలో జరిగిన తొలి టి20ని త్రుటిలో చేజార్చుకున్న కోహ్లి సేన ఈరోజు మ్యాచ్‌లో గెలిసి సిరీస్‌ను సమం చేయాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ఆసీస్ భావిస్తోంది. (విజయమే సమంజసం)